గత ఏడాది బేబితో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు గం. గం.. గణేశా అంటూ పలకరించడానికి రెడీ అయ్యాడు. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు హైప్ వచ్చింది. ఇక సినిమా మీద వున్న కాన్ఫిడెంట్ తో ఇండస్ట్రీ లో వున్న దగ్గరి వాళ్లకు స్పెషల్ షోస్ ను వేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ షో చూసిన వారు సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో హిలేరియస్ గా ఉందని సెకండ్ హాఫ్ లో కొంచెం గందరగోళం వున్నా థ్రిల్ చేసిందని క్లైమాక్స్ ఎంగేజింగ్ గా ఉందని ఓవరాల్ గా సినిమా మంచి టైం పాస్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. మొత్తానికి విడుదలకు ముందే పాజిటివ్ టాక్ రావడంతో టీం చాలా హ్యాపీ అవుతున్నారు. మరి రిలీజ్ తరువాత ఇదే టాక్ కంటిన్యూ అయితే ఆనంద్ కెరీర్ లో మరో సాలిడ్ హిట్ పడ్డట్లే.
ఇక ఈ సినిమాకు రన్ టైం తక్కువ ఉండడం కూడా ప్లస్ అవ్వనుంది. కేవలం 2గంటల 16నిమిషాల నిడివితో థియేటర్లలోకి రానుంది. ఉదయ్ బొమ్మిశెట్టి ఈ సినిమాను డైరెక్ట్ చేయగా చైతన్య భరద్వాజ్ సంగీతం అందించాడు. వంశీ కారుమంచి, కేదార్ సెలగంశెట్టి నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























