పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన కొంతకాలం సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇవన్నీ భారీ అంచనాలున్న మూవీస్ కావడం గమనార్హం. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు, వర్కింగ్ స్టిల్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. `దే కాల్ హిమ్ ఓజీ` అనే ట్యాగ్ లైన్ ఉన్న ఈ సినిమాకు సంబంధించి ‘ఓజీ` అంటే అర్థమేంటనేదానిపై ఇప్పటి వరకు మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ‘ఓజీ’ అనే టైటిల్ కి అర్ధం ఏంటనేది సుజీత్ వివరించారు. కొంతమంది ఇది కొరియన్ పదం అని, మరికొందరు జపాన్ పదం అని.. ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు. మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా సినిమా సాగుతుందని, అందుకే ఈ టైటిల్ పెట్టారని ఊహాగానాలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఓజీ గురించి ఆ చిత్ర దర్శకుడు సుజీత్ కొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ పంచుకున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ‘భజే వాయువేగం’ ప్రమోషన్స్ లో తాజాగా సుజీత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పవర్ స్టార్ మూవీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. `ఓజీ` అంటే ‘ఓజాస్ గంభీర’ అని తెలిపారు. ఇందులో ఓజాస్ అనేది గురువు పేరు అని, గంభీర అనేది సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు అని వివరించారు. కాగా ఈ పేరుతో సినిమాలో ఓ పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం డైరెక్టర్ సుజీత్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Director #Sujeeth reveals exciting updates about #OG movie! 💥💥💥#TheyCallHimOG – Ojas Gambheera ❤️🔥#PawanKalyan #OGonSept27th #TeluguFilmNagar pic.twitter.com/9gtoVGHCek
— Telugu FilmNagar (@telugufilmnagar) May 27, 2024
కాగా గతేడాది సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజైన ఓజీ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ గ్లింప్స్‌తో సినిమా ఏ రేంజ్‌లో ఉండనుందో అందరికీ అర్ధమైంది. ఇందులో అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ హైలైట్ గా నిలిచింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రూత్ లెస్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వగా.. ఎస్.తమన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో నెక్స్ట్ లెవెల్‍కు తీసుకెళ్లాడు.
ఇక ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘ఓజీ’ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే కిక్ శ్యామ్, వెంకట్ బచ్చు, అజయ్ ఘోష్, మొట్ట రాజేందర్, జీవా, హరీష్ ఉత్తమన్, శాన్ కక్కర్, అభిమన్యు సింగ్, కుమనన్ సేతురామన్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























