బెదురులంక తరువాత యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నుండి వస్తున్న సినిమా భజే వాయు వేగం.ఈసినిమా ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేశారు.ఇక ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా వుంది.స్నేహం,క్రికెట్,డబ్బు చుట్టూ తిరిగే కథ తో వస్తుంది ఈసినిమా.ట్రైలర్ చూస్తే సినిమాలో యాక్షన్ బాగానే ఉన్నట్లు వుంది.ఎమోషనల్ సీన్ తో ట్రైలర్ ను ఎండ్ చేశారు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.ఓవరాల్ గా ట్రైలర్ అయితే ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా రాహుల్ టైసన్ ,తనికెళ్ళ భరణి,రవి శంకర్ కీలక పాత్రలు చేశారు.రధాన్ సంగీతం అందిస్తున్నాడు.ప్రముఖ బ్యానర్ యూవీ కాన్సెప్ట్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.ఈనెల 31న విడుదలకానుంది.
ఇక అదే రోజు విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అలాగే ఆనంద్ దేవరకొండ గం. గం..గణేశా సినిమాలు కూడా వస్తున్నాయి.ఈరెండు సినిమాలకు కూడా మంచి బజ్ వుంది దాంతో బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొననుంది.మరి ఈపోటీని తట్టుకొని భజే వాయు వేగం,కార్తికేయకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























