క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా సంచలనాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నాడు బన్నీ. మరోవైపు ఈసినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా పస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మరోవైపు ఈసినిమా నుండి రిలీజ్ చేసిన అప్ డేట్లు అన్నీ సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాయో చూాశాం. రీసెంట్ గా రిలీజ్ చేసిన పుష్ప పుష్ప సాంగ్ కూడా ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకున్నాయే తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమాలో నటిస్తున్న మరో క్యారెక్టర్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో రావు రమేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా రావు రమేష్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సిద్దప్ప పాత్రలో రావు రమేష్ నటిస్తుండగా.. ఆయన లుక్ పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.
Wishing the dynamic actor who aces every role – #RaoRamesh garu a very Happy Birthday ❤🔥
Watch him as the powerful politician ‘Siddappa’ in #Pushpa2TheRule 💥
Grand release worldwide on 15th AUG 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP… pic.twitter.com/zu7KLg85Ne
— Pushpa (@PushpaMovie) May 25, 2024
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























