టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ.. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం సినిమాలతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ‘బేబీ’ సినిమాతో తొలి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన ఈసారి పంథా మార్చి యాక్షన్ జోనర్‌ను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గం గం గణేశా’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్గా నటించగా.. సారిక, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఇదే క్రమంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. మంచి స్పందన వచ్చింది.
By Ganesha’s grace!
Censored U/AWe’ll catch you in theatres on 31 May!
Watch trailer here https://t.co/0CLfmISM0M#GGG #GamGamGanesha@ananddeverkonda @UrsNayan @officialpragati @udaybommisetty @hylifeE #KedarSelagamsetty @thisisvamsik @saregamasouth @shreyasgroup pic.twitter.com/zzwGKkHTk1
— GSK Media (@GskMedia_PR) May 24, 2024
ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ కీలక ప్రకటన చేసింది. తాజాగా గం గం గణేశా సెన్సార్ కార్యక్రమాలను ముగించుకున్నట్లు తెలిపింది. అలాగే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్లు వెల్లడించింది. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించగా.. ఆదిత్య జవ్వాడి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాని నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























