అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్స్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టం – ప్రభాస్

Kalki 2898 AD Prabhas Praises Amitabh Bachchan and Kamal Haasan

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మరొక హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. వైజయంతి మూవీస్‌ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, స్పెషల్ వీడియోస్ అన్నీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. జూన్ 27వ తేదీన ‘కల్కి 2898 AD’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కస్టమ్-మేడ్ వాహనాన్ని విడుదల చేయడానికి ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన ఈ వేడుకకు డార్లింగ్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ‘బుజ్జి’ని ప్రపంచానికి పరిచయం చేయడానికి దాదాపు 1 నిమిషం నిడివి గల టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ “నా దర్శకుడు నాగ్ అశ్విన్ నన్ను 3 సంవత్సరాలు టార్చర్ పెట్టాడు. ఈ కార్యక్రమానికి క్యాజువల్‌ గా రావాలనుకున్నాను. కానీ నాగ్ అశ్విన్ నన్ను ఈ విన్యాసాలు చేసేలా చేశాడు. క్యూరియాసిటీని పెంచడానికి ‘ఎవరో స్పెషల్’ అనే ట్వీట్‌ను పోస్ట్ చేయాలనేది నా దర్శకుడి ఆలోచన. ఇది పబ్లిసిటీలో భాగమైంది. బుజ్జి టీజర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో ‘బుజ్జి’ పాత్ర చాలా ప్రత్యేకం. బుజ్జి మరో సూపర్ స్టార్. మీరు నన్ను ఎన్నుకోమని అడిగితే, నేను దాని మెదడు కంటే, బుజ్జి శరీరాన్ని ఎంచుకుంటాను. మీ అందరిలాగే నేను కూడా సినిమా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. సినిమా చేసినందుకు వారికి నా ధన్యవాదాలు. ఈ ఇద్దరు నటుల ద్వారా యావత్ భారతదేశం స్ఫూర్తి పొందింది. దక్షిణాదిలో అమితాబ్ కూడా అంతే పెద్ద స్టార్. సాగర సంగమం చూసి మా అమ్మని ఆ వేషం నాకు వేయమని అడిగాను” అని గుర్తు చేసుకున్నారు.

“దీపిక అత్యంత అందమైన సూపర్ స్టార్. ఆమె అంతర్జాతీయ సినిమాలు మరియు అంతర్జాతీయ ప్రకటనలు చేస్తోంది. ఆమె సినిమాలో నటించడం మా అదృష్టం. దిశా పటానీ హాట్ స్టార్. మా ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారు మాపై చాలా నమ్మకం ఉంచారు. బడ్జెట్‌ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఏకైక నిర్మాత. అదృష్టవశాత్తూ, ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా సినిమా అంటే తమ తండ్రికి సమానమైన ప్యాషన్, ధైర్యం కలిగి ఉన్నారు. వారు పనిచేసే విధానం చూసి మనమందరం స్ఫూర్తి పొందాలి. స్వప్న, ప్రియాంకలకు ధన్యవాదాలు” అని తెలిపారు ప్రభాస్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.