దేవర నుండి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఫియర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. 24గంటల్లో ఈ సాంగ్ అన్ని భాషల్లో కలిపి 28 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది. దాంతో రీసెంట్ విడుదలైన పుష్ప 2 సాంగ్ ను క్రాస్ చేసింది.పుష్ప సాంగ్ 26మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా దేవర తెలుగు తోపాటు హిందీ లో అదరగొడుతుంది. తెలుగు వెర్షన్ ఇప్పటివరకు 18మిలియన్ల వ్యూస్ ను తెచ్చుకోగా హిందీ 12మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకుంది.ఓవరాల్ గా ఫియర్ సాంగ్ అంచనాలను అందుకొని సినిమాకు వున్న హైప్ పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.దేవర రెండు భాగాలుగా రానుండగా ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న విడుదలకానుంది.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఈసినిమా తోపాటు వార్ 2 లోకూడా నటిస్తున్నాడు. రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ లోకూడా పాల్గొన్నాడు.ఇవి కాకుండా ఆగస్టు నుండి ఎన్టీఆర్ మరో సినిమాను కూడా మొదలుపెట్టనున్నాడు.ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించనుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈసినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























