టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుండగా.. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ స్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు ‘లవ్ మీ’ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ మూవీ విశేషాలు పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా హీరో ఆశిష్ మాట్లాడుతూ.. “ఇంత మంచి స్క్రిప్ట్‌ను నాకు ఇచ్చిన అరుణ్, నాగలకు థాంక్స్. మా చిత్రానికి మేజర్ అస్సెట్ అయిన పీసీ శ్రీరామ్, కీరవాణి గార్లకు థాంక్స్. టీజర్, ట్రైలర్ బాగుంటే సినిమాను చూస్తారు. కథ బాగుంటే ఆడియెన్స్ మూవీస్ చూస్తారు. మా చిత్రంతో మళ్లీ థియేటర్లకు కళ వస్తుంది. సింగిల్స్ స్క్రీన్స్ నిండిపోతాయి. చీకటి రూం అంటేనే నాకు భయం. అలాంటి నన్ను స్మశానంలోకి తీసుకెళ్లారు. వైష్ణవి, రవి అందరితో షూటింగ్ చేయడం ఆనందంగా ఉంది. మా నిర్మాతలు హర్షిత్ అన్న, హన్షిత అక్క, దిల్ రాజు గార్లకు థాంక్స్. మే 25న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























