లవ్ మీ న్యూ ఏజ్ లవ్ స్టోరీ, పెద్ద హిట్ అవుతుంది – దిల్ రాజు

Love Me is A New Age Love Story Says Producer Dil Raju

టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయి‌న్‌గా నటిస్తుండగా.. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ స్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు ‘లవ్ మీ’ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ మూవీ విశేషాలు పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘అరుణ్, నాగ ఈ చిత్రానికి బలం. ఇంత వరకు నేను దర్శకుల్ని పరిచయం చేశాను. మొదటి సారి నాగను నిర్మాతగా పరిచయం చేస్తున్నాను. ట్రైలర్ చూస్తే టీం పడ్డ కష్టం తెలుస్తుంది. ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ కానుంది. ఆడియెన్స్‌కు నచ్చితేనే సినిమా హిట్ అవుతుంది. మే 25న ఈ సినిమా ప్రేక్షకులను నచ్చి పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సినిమా టీం అందరికీ థాంక్స్. యంగ్ టీం అంతా కలిసి కొత్త కథతో కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు వస్తున్నారు’ అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.