రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ ఈసిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ రెండు సిరీస్ లు రాగా రెండు సిరీస్ లూ ఎంతో ప్రేక్షకాదరణ పొందాయి. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వగా… రెండో సిరీస్ ను కూడా తెరకెక్కించారు. ఈ సిరీస్ 2021లో రిలీజ్ అయింది. సిరీస్ 2 లో స్టార్ హీరోయిన్ సమంత కూడా నటించగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 3 రాబోతున్న సంగతి తెలిసిందే కదా. అయితే కొంత కాలంగా రాజ్ అండ్ డీకే సిటాడెల్ హిందీ వెర్షన్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఈసిరీస్ సెట్స్ పైకి రాలేకపోయింది. ఇటీవలే ఆ సిరీస్ షూటింగ్ కూడా పూర్తయిపోవడంతో ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్3పై ఫోకస్ ను పెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. తాజాగా మూడో సీజన్ కి సంబంధించి షూటింగ్‌ను ప్రారంభించినట్లు మేకర్స్ ప్రకటించారు. మూడో సీజన్ రెండు సీజన్లకు మించి ఉంటుందని.. థ్రిల్లింగ్ అంశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది. కాగా ఈసిరీస్ లో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, శరీబ్ హష్మీ తదితరులు నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























