మెగాస్టార్ చిరంజీవి నుండి వస్తున్న సినిమా విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. చాలా ఏళ్ల తర్వాత త్రిష-చిరు జంటగా నటిస్తున్నారు. ఇక నేడు త్రిష తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో త్రిష కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. దీనిలో భాగంగానే విశ్వంభర టీమ్ కూడా తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ ను అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing the eternal beauty and the epitome of charm @trishtrashers a very Happy Birthday ✨
— Team #Vishwambhara
In cinemas 10th Jan 2025 🌠
MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @NaiduChota @mayukhadithya @sreevibes @gavireddy_srinu @UV_Creations pic.twitter.com/2uvQpjhWWo
— UV Creations (@UV_Creations) May 4, 2024
కాగా ఈసినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. ఈసినిమాను వచ్చేే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























