ఈఏడాది నా సామిరంగ సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు కింగ్ నాగార్జున. ఇప్పుడు మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కుబేర. ఈసినిమాలో నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నసంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఈమధ్యే బ్యాంకాక్ లో ఒక కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈసినిమా రీసెంట్ గానే మరో కీలక షెడ్యూల్ ను ముంబైలో స్టార్ట్ చేసింది. అక్కడ పలు ఇంపార్టెంట్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి సినిమా ఫస్ట్ లుక్ తో పాటు ధనుష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ధనుష్ ఫస్ట్ లుక్ అయితే ట్రెమెండెస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా నాగార్జున ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Here’s the most awaited FIRST LOOK of KING @IamNagarjuna from #SekharKammulasKUBERA ❤️🔥🔥
More thunderous updates coming soon 🌋
– https://t.co/MlWTIPblCz@dhanushkraja @iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @SVCLLP @amigoscreation @AdityaMusic pic.twitter.com/RdUWZ2Z3vE
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) May 2, 2024
కాగా ఈసినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ తో పాటు పలు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























