నేను గౌరవించే విలక్షణ నటుడు అల్లరి నరేష్ – డైరెక్టర్ దేవా కట్టా

Aa Okkati Adakku Pre Release Event Director Deva Katta Praises Allari Naresh

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‍గా నటిస్తోంది. స్టార్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. ఇక అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేయగా.. మే 3న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హీరో అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరవగా.. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ దేవా కట్టా మాట్లాడుతూ.. నరేష్ నా మనసుకి చాలా దగ్గరైన స్నేహితుడు. నేను గౌరవించే విలక్షణ నటుడు నరేష్. తన ప్రయాణం ఇలానే వెర్సటైల్ గా సాగాలి. ఫారియా చాలా పెద్ద స్టార్ అవుతుంది. ఈ సినిమా సుడిగాడు లాంటి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

అలాగే ప్రముఖ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి మాట్లాడుతూ.. “పెళ్లి అనేది పవిత్రమైనది. జీవితాన్ని ఆనందంగా వుంచేది. అలాంటి పెళ్లి చుట్టూ ఎన్ని మోసాలు జరుగుతున్నాయో చూపించే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేశాం. కొందరి కారణంగా పెళ్లి ఆనందానికి చిల్లు పడుతుంది. అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సరదా గా చెప్పే ప్రయత్నం ఈ సినిమా. నవ్వు ఎమోషన్ రెండూ ప్రేక్షకులు ఎక్స్ పీరియన్స్ చేస్తారు. అందరికీ నచ్చే సినిమా ఇది. కుర్రాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా” అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.