కె.జి.యఫ్ సినిమాతో కన్నడ రాక్ స్టార్ యష్ దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడో తెలిసిందే కదా. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక దీని సీక్వెల్ గా వచ్చిన కె.జి.యఫ్ 2 కూడా రీసెంట్ గానే రిలీజ్ అయి మరో సంచలనం సృష్టిస్తుంది. ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉండగా.. ఆ అంచనాలను ఎక్కడా తగ్గించకుండా రాఖీభాయ్ తన సత్తా చూపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా వచ్చి ఏడాది అయిపోయినా కూడా యష్ నుండి కొత్త సినిమా ఇంకా రాలేదు. యష్ నుండి ఎలాంటి సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అప్ డేట్ రానే వచ్చేసింది. యష్ న్యూ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. డిసెంబర్ 8వ తేదీన ఉదయం 9 గంటల 55 నిమిషాలకు ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈసినిమా డైరెక్టర్ గురించి కూడా ఆరోజే క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మించనున్నారు.
Mark your calendars for 8th December 2023, 9.55AM as the most awaited title announcement for Rocking star Yash’s next #Yash19 in collaboration with KVN Productions will be announced. 🔥🔥
Let the countdown begin!@thenameisyash @kvnproductions #TeluguFilmNagar pic.twitter.com/fYwaokfjHr
— Telugu FilmNagar (@telugufilmnagar) December 4, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























