సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ కన్‍ఫర్మ్.. ఆ రోజు ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పండగే

Prabhas Starrer Salaar Part 1-Ceasefire’s Trailer Release Date Confirmed

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సలార్‌’. ఈ సినిమా కోసం ఒక్క టాలీవుడ్‌ లోనే కాకుండా వరల్డ్‌వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ గూజ్ బంప్స్‌ తెప్పించే విజువల్స్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ‘కేజీఎఫ్‌’ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్’ మూవీ రెండు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. ‘సలార్‌: పార్ట్-1 సీజ్ ఫైర్’ సినిమా డిసెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా నుంచి సాలిడ్ అప్‌డేట్‌ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీపావళి రోజున ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించారు. ‘సలార్‌: పార్ట్-1 సీజ్ ఫైర్’ ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇక డిసెంబర్ 1వ తేదీ రాత్రి 7.19 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన మేకర్స్.. ఈ సందర్భంగా ప్రభాస్ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అందులో.. ప్రభాస్ ఓ జీపుపైకి ఎక్కి చేతిలో రైఫిల్‌తో ఇంటెన్స్ లుక్‌లో కనిపించాడు. అయితే ఇంతకుముందు విడుదల చేసిన టీజర్‌లో ప్రభాస్ ను కనిపించీ, కనిపించినట్లు చూపించిన ప్రశాంత్ నీల్.. ట్రైలర్‌లో అయినా రెబెల్ స్టార్‌ను ఓ రేంజ్‌లో చూపించొచ్చు అని భావిస్తున్నారు.

కాగా తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతోన్న సలార్ సినిమాలో ప్రభాస్‌ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, టిన్నూ ఆనంద్, ఈశ్వ‌రీ రావు తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌కు ‘కేజీఎఫ్‌’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

కాగా ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండనుంది. మూవీలో వచ్చే ఒక ఆన్-గ్రౌండ్ యాక్షన్ సీక్వెన్స్‌ కోసం జీప్‌లు, ట్యాంకులు, ట్రక్కులు మొదలైన వాటితో సహా మొత్తం 750కి పైగా భారీ వాహనాలను వినియోగిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇది ఒక హాలీవుడ్ సినిమాల్లో కనిపించే వార్ సీక్వెన్స్ అంత పెద్దది కావడం గమనార్హం. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం మరియు హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో రిలీజ్ చేయనున్నారు. అయితే అదేరోజు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటిస్తున్న ‘డంకీ’ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య కలెక్షన్స్ వార్ షురూ కానుంది. ‘డంకీ’ ప్రభావం ‘సలార్’పై ఉంటుందా? ఈ ఇద్దరు సూపర్ స్టార్లలో ఎవరిది పైచేయి అవుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.