మెగా ఫ్యామిలీ ప్రస్తుతం పెళ్లి సందడితో ఉన్న సంగతి తెలిసిందే కదా. మెగ ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎన్నో ఏళ్ల ప్రేమాయణం తరువాత ఇప్పుడు ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒకటవుతున్నారు. ఇటీవలే వీరి నిశ్చితార్థం జరగగా తాజాగా మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహం ఇటలీలో జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. మెగా పరివారంతో పాటు ఇరు కుటుంబ సభ్యుల సన్నిహితులు కూడా ఈ వివాహానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత మూడు రోజులాగా పెళ్లి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. కాక్ టైల్ పార్టీ, హల్దీ ఇలా పలు వేడుకలు జరుగగా వాటికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. గత రాత్రి వరుణ్ లావణ్యకు మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇప్పుడు పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో తాజాగా నాగబాబు తన ట్విట్టర్ ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు. నాకు ఇష్టమైన వారందరి మధ్య ఉండి నా కొడుకు వరుణ్ పెళ్లి చూస్తూ నా మనసు ఎన్నో భావోద్వేగాలు ఇంకా ఎన్నో జ్ఞాపకాలతో నిండిపోయింది. ఒకప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్న వరుణ్ ఇప్పుడు ఒక పరిపూర్ణమైన వ్యక్తి అయ్యాడు. జీవితంలో మరో అథ్యయనంలో అడుగుపెడుతున్నాడు. నాకు ఎంతో గర్వంగా ఉంది.. అలాగే పలు స్మృతులు గుర్తుకువస్తున్నాయి. ఇది మా కుటుంబంలో ఒక అందమైన జర్నీ ఇప్పుడే మొదలైంది అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
View this post on Instagram
కాగా రీసెంట్ గానే గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమాను డిసెంబర్ 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























