ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన ఘనతను అందుకోనున్నారు. త్వరలోనే ఆయన మైనపు విగ్రహం ప్రతిష్టాత్మక ‘మేడమ్ టుస్సాడ్స్’లో కొలువుదీరనుంది. కాగా లండన్‌లోని ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వివిధ దేశాలకు చెందిన పలువురు ప్రముఖుల నమూనాలను వాక్స్ ఐడల్స్ రూపంలో ప్రతిష్టిస్తారు. ఈ విగ్రహాలు చూడటానికి అచ్చు ఆయా వ్యక్తులలాగే కనిపించడం వీటి ప్రత్యేకత. వీటిని సుశిక్షితులైన నిపుణులు అంత బాగా రూపొందిస్తారు. అయితే ప్రస్తుతం అనేక దేశాల్లో టుస్సాడ్స్ మ్యూజియాలను ఏర్పాటు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో అల్లు అర్జున్ విగ్రహాన్ని దుబాయ్‌లోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించనున్నారు. అలాంటి గొప్ప గౌరవాన్ని అందుకోవడం ద్వారా అల్లు అర్జున్ ఇప్పుడు ఆయన అభిమానులకే కాకుండా.. యావత్ తెలుగువారందరికీ గర్వకారణం అయ్యారు. ప్రసుతం అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని లండన్‌లో స్థాపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గురువారం, ఆయన తన కొలతలు ఇస్తున్న వీడియో బయటపడింది. అందులో అల్లు అర్జున్ నల్లటి సూట్ ధరించి ఉన్నారు. అయితే ఆయన నటించిన ‘అల వైకుంఠపురం’ చిత్రంలోని బోర్డ్‌రూమ్ డ్యాన్స్ సన్నివేశంలో ధరించిన ఐకానిక్ రెడ్ జాకెట్‌ను విగ్రహంపై ఉంచనున్నట్లు తెలుస్తోంది.
National Award Winner @alluarjun will soon be a part of Madame Tussauds Dubai’s star-studded lineup. Actors wax statue to be unveiled soon#AlluArjun #MadameTussauds pic.twitter.com/eNdpQyy8js
— Suresh PRO (@SureshPRO_) October 5, 2023
ఇక అతి త్వరలోనే విగ్రహం రూపొందించడం ప్రారంభించనున్నారు. ఇది పూర్తయిన తర్వాత, అల్లు అర్జున్ ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా దుబాయ్ వెళ్లనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ మైనపు విగ్రహం మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరడం ద్వారా.. దక్షిణాది నుండి ఈ ఘనత అందుకున్న నాలుగో స్టార్ గా గుర్తింపు పొందనున్నారు. అల్లు అర్జున్ కంటే ముందు ప్రభాస్, మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మలను ఈ మ్యూజియంలో ఆవిష్కరించారు.
కాగా దక్షిణ భారతదేశం నుంచి మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి స్టార్ ప్రభాస్ కావడం విశేషం. ఇక ఇదిలా ఉండగా.. మరోవైపు బాలీవుడ్ నుంచి మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొణె, కరీనా కపూర్ తదితరుల మైనపు విగ్రహాలను ప్రతిష్టించారు. ఇప్పుడు తాజాగా ఈ నటుల జాబితాలోకి అల్లు అర్జున్ పేరు కూడా చేరనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























