జనవరి 12 విడుదల నుండి దీపుగా కృతి శెట్టి ట్రెడిషనల్ ఫస్ట్ లుక్‌ రిలీజ్ 

Kriti Shetty’s First Look as Deepu from January 12 Vidudala is Out Now

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ ఫెస్టివ్ ఎంటర్‌టైనర్ ‘జనవరి 12 విడుదల’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి ఆర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ ఆసక్తిని పెంచుతోంది. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ ఇటీవల హిలేరియస్, ఎంటర్‌టైనింగ్ వీడియో ద్వారా ప్రకటించారు. దీంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్‌ను పరిచయం చేసిన మేకర్స్.. నిన్న హీరోయిన్ కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెను ‘దీపు’ గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కృతి శెట్టి ట్రెడిషనల్ అవతార్‌లో ఆకట్టుకున్నారు. పర్పుల్-పింక్ కలర్ హాఫ్ సారీలో అందంగా కనిపించారు. ఆమె ఆహ్లాదకరమైన చిరునవ్వు ఈ ఫస్ట్ లుక్‌కు మరింత చార్మ్, ఎలిగెన్స్‌ను తీసుకొచ్చింది.

ఈ చిత్రానికి టాప్  టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ,  తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్,  ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌కు తోడు కీర్తి సురేష్, కృతి శెట్టి లాంటి స్టార్స్ ఉండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ చిత్రం ఫెస్టివల్ సీజన్‌లో ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతోంది.

ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సీజన్ అనిల్ రావిపూడికి సక్సెస్‌ఫుల్ విండోగా నిలుస్తూ వస్తోంది. తన సినిమాలను వరుసగా ఫెస్టివ్ సీజన్‌లో విడుదల చేస్తూ బలమైన కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన అనిల్ రావిపూడి.. ఈసారి ‘జనవరి 12 విడుదల’తో  అద్భుతమైన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ అందించబోతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.