పెద్ది విడుదల తేదీ ఖరారు

Peddi Release Date Finalized

ఎట్టకేలకు రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదల తేదీపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 30నే విడుదల కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల జూన్‌కు వాయిదా పడింది. జూన్ నెలలో ఏ తేదీన వస్తుందనే విషయంలో స్పష్టత లేకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మేకర్స్ జూన్ 4వ తేదీని ఖరారు చేశారు.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన ‘రంగస్థలం’ను మించేలా ఉంటుందని దర్శకుడు సుకుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, బొమ్మన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.