నాగబంధం ఫస్ట్ సింగిల్ రిలీజ్

First Single Namo Re from Nagabandham Out Now

విరాట్ కర్ణ, అభిషేక్ నామా, ఎన్ ఐ కె స్టూడియోస్ & అభిషేక్ పిక్చర్స్ పాన్-ఇండియా మాగ్నమ్ ఓపస్ ‘నాగబంధం’ నుంచి సేక్రెడ్ మాస్టర్ పీస్ “నమో రే” సాంగ్ రిలీజయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్-ఇండియా మాగ్నమ్ ఓపస్ ‘నాగబంధం’ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన “నమో రే” పాట విడుదలైంది. దర్శకుడు అభిషేక్ నామా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపరెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, కళాత్మక సంపదను ప్రతిబింబించేలా రూపొందుతోంది.

తాజాగా విడుదలైన “నమో రే” పాట భక్తి యుగానికి శ్రీకారం చుట్టింది. శ్రీమహా విష్ణువుకు అంకితంగా రూపొందిన ఈ పాట భక్తి, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక అనుభూతిని అద్భుతంగా చూపించింది.

ఈ సాంగ్‌కు జునైద్ కుమార్, అభే అద్భుతమైన మ్యూజిక్ అందించారు. క్లాసికల్ టచ్‌తో పాటు మోడరన్ మ్యూజిక్ స్టైల్‌ను కలిపి గొప్ప అనుభూతిని ఇచ్చారు. శ్రీహర్ష ఈమని లిరిక్స్‌ లో భక్తి భావం అద్భుతంగా వినిపిస్తుంది. గాయకులు సింధుజా శ్రీనివాసన్, ఐశ్వర్య దారూరి పాడిన విధానం పాటకు మరింత బలాన్ని ఇచ్చింది.

ఈ సాంగ్‌లో మరో పెద్ద ఆకర్షణ మ్యాసీవ్ కొరియోగ్రఫీ. ప్రముఖ కొరియోగ్రాఫర్లు గణేశ్ ఆచార్య, శ్రష్టి వర్మ నేతృత్వంలో దాదాపు రెండు వేల మందికి పైగా డ్యాన్సర్లు వివిధ భారతీయ నృత్యాలతో అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇచ్చారు. హీరోయిన్లు నభా నటేశ్, దక్ష నాగార్కర్ క్లాసికల్ డ్యాన్స్‌తో సాంగ్‌ను మరింత గ్రాండ్‌గా మార్చారు.

ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని అచ్చంగా గుర్తుకు వచ్చేలా ఒక అద్భుతమైన సెట్ రూపొందించారు. తిరువనంతపురంలోని అసలు ఆలయంలోనే షూట్ చేసినట్టుగా అనిపించేంత ఖచ్చితంగా ఈ సెట్‌ను తయారు చేశారు. ఆలయంలో కనిపించే పవిత్ర మార్గాలు, అందమైన శిల్పాలు అన్నీ ఎంతో జాగ్రత్తగా సెట్‌లో చూపించారు. ప్రతి చిన్న డీటైల్ కూడా పరిశోధన చేసి రూపొందించినట్టుగా కనిపిస్తుంది. ఈ సెట్ గ్రాండియర్‌తో పాటు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా తీసుకొచ్చింది. స్క్రీన్‌పై చూసిన వెంటనే ప్రేక్షకులు నిజమైన ఆలయంలోకి వెళ్లినట్టుగా అనిపించే ఫీల్ ఇస్తుంది. సినిమాలో ఇది అత్యంత ప్రత్యేకంగా నిలిచే క్రియేటివ్ హైలైట్‌లలో ఒకటిగా నిలవనుంది.

సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ తన కెమెరాతో ఈ సెట్ గ్రాండియర్‌ను మరింత అందంగా చూపించారు. కలర్స్, లైటింగ్, ఫ్రేమ్స్ అన్ని కలిసి ఈ సాంగ్‌ను నెక్స్ట్ లెవల్ లో ప్రజెంట్ చేశాయి.

“నమో రే” సాంగ్ కేవలం ఒక పాట మాత్రమే కాదు. భక్తి, ఐక్యత భావాలను చెప్పే ఒక ప్రత్యేక అనుభూతిలా వుంది. లిరిక్స్, మ్యూజిక్, మ్యాసీవ్ కొరియోగ్రఫీ అన్నీ కలిసి ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తున్నాయి. ఈ పాట యూనివర్సల్ గా అందరికీ కనెక్ట్ అవుతోంది.

నాగబంధం సినిమాపై ఇప్పటికే హ్యుజ్ బజ్ నెలకొంది.“నమో రే” సాంగ్ చూసిన తర్వాత అంచనాలు మరింతగా పెరిగాయి. ఎంటర్టైన్‌మెంట్‌తో పాటు భక్తి, భావోద్వేగాలను కూడా ప్రేక్షకులకు అందించేలా సినిమా అద్భుతంగా రూపొందుతోంది.నాగబంధం సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.