శర్వానంద్ కథానాయకుడిగా, మాస్ సినిమాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ సరికొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో యాక్షన్ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ భారీ షెడ్యూల్‌లో భాగంగా రెండు హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్లను చిత్రీకరించబోతున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో ఈ పోరాట దృశ్యాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేశారు. 1960ల నాటి ఉత్తర తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దుల నేపథ్యంలో సాగే ఈ ‘ఫైరీ వరల్డ్’ ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని రీతిలో కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం పేర్కొంది. శర్వానంద్ మునుపెన్నడూ లేని విధంగా ఒక రగ్గడ్ మరియు ఇంటెన్స్ లుక్‌లో ఈ యాక్షన్ సీక్వెన్స్‌లలో పాల్గొంటున్నారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ మరియు డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. శర్వానంద్ కెరీర్‌లోనే ఇది ఒక అతిపెద్ద యాక్షన్ మూవీగా నిలవనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























