వెంకీ 77 హీరోయిన్ రేస్ లో శ్రీనిధి శెట్టి

Srinidhi Shetty Considered for Venkatesh 77 Female Lead

మచ్ అవైటెడ్ కాంబో సీనియర్ హీరో వెంకటేష్ -స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్  కలిసి సినిమా చేయనున్నారని తెలిసిందే.రీసెంట్ గానే ఈసినిమాను అఫీషియల్ గా లాంఛ్ కూడా చేశారు.ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనుంది.మరి కొద్దీ రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.వీలైనంత తొందరగా ఈసినిమాను కంప్లీట్ చేయనున్నారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి.హిట్ 3 ఫేమ్ శ్రీనిధి శెట్టిని ఇందులో హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట. అందుకు సంబంధించిన ఫోటో షూట్ ను కంప్లీట్ చేశారట.త్వరలోనే  హీరోయిన్ ఎవరనేది క్లారిటీ రానుంది.ఇక మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా ఫిక్స్ చేశారని సమాచారం.యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 

ఇక ఇంతకుముందు వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావ్ ,మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ స్టోరీ&  డైలాగ్స్ అందించాడు.ఇందులో నువ్వు నాకు నచ్చావ్ ఆల్ టైం కల్ట్ మూవీ గా పేరు తెచ్చుకోగా మల్లీశ్వరి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత వెంకీ – త్రివిక్రమ్ కలిసి సినిమా చేయనుండడంతో వీరి కాంబోలో వస్తున్న వెంకీ 77పై అంచనాలు భారీగా వున్నాయి. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.