జన నాయగన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ వాయిదా

Jana Nayagan First Single Release Postponed

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కెరీర్ లో చివరి సినిమాగా వస్తుంది జన నాయగన్.కమర్షియల్ పొలిటికల్ ఎంటర్టైనర్ గా ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.ఈసినిమా నుండి ఇప్పటివరకు పోస్టర్స్, గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు. ఇక ఈ దీపావళికి జన నాయగన్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. అయితే రీసెంట్ గా విజయ్ పొలిటికల్ ర్యాలీలో భాగంగా తమిళనాడులోని కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 40 మందికి పైగా చనిపోయారు. ఈ ఘటన తమిళనాడులో దుమారం సృష్టించడంతో ఇలాంటి సమయంలో జన నాయగన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని నిర్మాతలు వాయిదావేశారు.కుదిరితే నవంబర్ లో ఈసాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.విజయ్ ఈ పాటను పాడగా అనిరుధ్ సంగీతం అందించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా బాబీ డియోల్,ప్రకాష్ రాజ్,గౌతమ్ మీనన్ ,నరైన్,ప్రియమణి,మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.కె వి ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.జనవరి 9న ఈసినిమా రిలీజ్ కానుంది.

ఇక తెలుగులో ఈసినిమా జన నాయకుడు గా రిలీజ్ కానుంది. అయితే సంక్రాంతికి తెలుగు నుండి పెద్ద సినిమాలు బరిలోకి దిగుతుండడంతో జన నాయకుడు తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదుర్కోనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.