కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘జూనియర్’. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. అలాగే కన్నడ సినిమా ఐకాన్, క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్రన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైననర్‌గా రూపొందుతున్న ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ ఇటీవలే ఫస్ట్ సింగిల్ ‘లెట్స్ లివ్ దిస్ మోమెంట్’ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ జోరుని మరింత పెంచుతూ జూనియర్ టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ఈ టీజర్ సినిమా టోన్, హిలేరియస్, ఫుల్-ఆన్ ఎంటర్టైనింగ్ స్నాప్‌షాట్‌ను అందిస్తుంది. కిరీటి ఒక రిలాక్స్డ్ కాలేజీ కుర్రాడు, మార్క్స్ కంటే హ్యాపినెస్ ని ఇష్టపడతాడు, తన చుట్టూ ఉన్న వారిని ఆకర్షించే వ్యక్తిత్వం వున్న తను శ్రీలీలాను ఇష్టపతాడు, మొదట గొడవతో మొదలైన జర్నీ మెల్లాగా ఎట్రాక్టివ్ కెమిస్ట్రీగా మారుతుంది.
టీజర్లో కిరీటి అదరగొట్టాడు. తన డ్యాన్స్ మూవ్స్, స్టంట్స్, స్పాట్-ఆన్ కామిక్ టైమింగ్ అద్భుతంగా వున్నాయి. టీజర్లో కిరీటి చెప్పిన డైలాగులు అదిరిపోయాయి. అందరినీ అలరించేలా వున్నాయి. హీరోయిన్గా శ్రీలీల కూల్‌గా కనిపించింది. టీజర్ చివరిలో బాస్ పాత్రతో జెనీలియా డిసౌజా కనిపించడం మరింత ఆసక్తికరంగా వుంది. వైవా హర్ష పాత్ర కామిక్ రిలీఫ్‌ని ఇచ్చింది.
కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. విజువల్స్ చాలా గ్రాండ్‌గా వున్నాయి. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అదిరిపోయింది. ఆయన సంగీతం యూత్ ఎనర్జీ, సినిమాటిక్ పంచ్‌తో అలరించింది. మొత్తానికి టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
రవీందర్ ప్రొడక్షన్ డిజైన్, ఇండియా టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ హై-ఆక్టేన్ యాక్షన్, నిరంజన్ దేవరమనే ఎడిటింగ్ అద్భుతంగా ఉన్నాయి. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. వారాహి చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్న జూనియర్ తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























