గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా టైటిల్, రెండు అద్భుతమైన ఫస్ట్-లుక్ పోస్టర్స్ సహా ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్ హ్యుజ్ బజ్ సృష్టించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు పెద్ది 30శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం అయింది. హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ ఇందులో పాల్గొంటున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు ‘మున్నాభయ్యా’ కూడా జాయిన్ అయ్యాడు. ఈ షెడ్యూల్ లో వీరందరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
కాగా ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: