పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశాడు.దాదాపు మూడేళ్ళ క్రితం ఈసినిమా షూటింగ్ మొదలు పెట్టిన పవన్ ఈరోజు తో కంప్లీట్ చేశాడు.నిజానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈసినిమా పవన్ రాజకీయంగా బిజీ కావడంతో చాలా ఆలస్యవుతూ వచ్చింది.ఇక ఈరోజుతో పవన్ తన పాత్ర తాలూకు షూటింగ్ కంప్లీట్ చేశాడు.దాంతో షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యినట్లే.అయితే రీసెంట్ గా మే 9న రిలీజ్ చేస్తామని ప్రకటించినా ఇప్పుడు ఆ డేట్ కు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో వాయిదావేశారు. కుదిరితే మే 30న రిలీజ్ చేయాలని ప్లాన్ లో వున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమా రెండు భాగాలుగా రానుంది.ఈసినిమాను సగానికి పైగా క్రిష్ డైరెక్ట్ చేయగా మిగితా భాగం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.ఇందులో నిధి అగర్వాల్ ,నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తుండగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో దాదాపు 100కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం నిర్మిస్తుండగా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.
ఇక పవన్ మరో రెండు సినిమాలను పూర్తి చేయాల్సివుంది.అందులో మచ్ అవైటెడ్ ఓజీ ఒకటి కాగా మరొకటి ఉస్తాద్ భగత్ సింగ్.ఇందులో ఓజీని సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.నెక్స్ట్ పవన్ ఈసినిమాను కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట. ఈనెల 14నుండి ఓజీ షూటింగ్ తిరిగి ప్రారంభంకానుందని వార్తలు వస్తున్నాయి.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: