అర్జున్ S/O వైజయంతి నుండి ముచ్చటగా బంధాలే సాంగ్ రిలీజ్

Muchataga Bandhaale Lyrical Video Released From Arjun Son of Vyjayanthi

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తుంది. తల్లీ కొడుకుల అనుబంధం ప్రధానాంశంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్- ముచ్చటగా బంధాలే సాంగ్ ని లాంచ్ చేశారు మేకర్స్. చిత్తూరులో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌లో హీరో కళ్యాణ్ రామ్, విజయశాంతి సహా చిత్ర యూనిట్ పాల్గొంది. రఘు రామ్ సాహిత్యం తల్లి స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. ఆమె తన కొడుకు విజయం సాధించాలనే కలలను సాకారం చేసుకుంటూ, అతనికి నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అదే సమయంలో, కొడుకు తన తల్లిని సంతోషంగా, గర్వంగా ఉంచేందుకు ఎంతో ప్రయత్నిస్తాడు.

స్టార్ కంపోజర్ బి అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన ముచ్చటగా బంధాలే, కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీ కొడుకుల భావోద్వేగ అనుబంధంను సున్నితంగా చిత్రీకరించిన మేలోడిక్ మాస్టర్ పీస్. తల్లి-కొడుకుల బంధంతో పాటు, ఈ పాట కళ్యాణ్ రామ్ ప్రేమ వైపు ఒక గ్లింప్స్ అందిస్తుంది, సాయి మంజ్రేకర్‌తో అతని సున్నితమైన రిలేషన్ ని పాటకు అదనపు ఎమోషన్ ని జోడిస్తుంది.

అలాగే హరిచరణ్ సోల్ ఫుల్ వాయిస్ ఈ పాట ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేసింది. మొత్తంమీద, ముచ్చటగా బంధాలే సాంగ్ తల్లి-కొడుకుల అనుబంధానికి చాటిచెప్పేలావుంది. కాగా ఈ చిత్రానికి సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ప్రముఖ పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ రామ్ ప్రసాద్, ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్ విస్సా. ఇక ఇప్పటికే హ్యుజ్ సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.