కోలీవుడ్ స్టార్ హీరో హీరో సూర్య ఇటీవలే ‘కంగువా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు తాజాగా ఆయన ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సూర్య 45’ (వర్కింగ్ టైటిల్). ఇటివలే గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. మల్టీ ట్యాలెంటెడ్ ఆర్జే బాలాజీ ఈ మాగ్నమ్ ఓపస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జోకర్, అరువి, ధీరన్ అధిగారం ఒండ్రు, ఖైదీ, సుల్తాన్, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి బ్లాక్‌బస్టర్‌లను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై నిర్మాతలు ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఇటు సూర్య, అటు ప్రొడక్షన్ హౌస్‌లకు మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ కానుంది.
తాజాగా మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో సౌత్ క్వీన్ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ప్రాజెక్ట్ లోకి వెల్ కం చెబుతూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో త్రిష చరిస్మాటిక్ ప్రజెన్స్ కట్టిపడేసింది. ఈ చిత్రంలోని మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలని త్వరలో మేకర్స్ తెలియజేస్తారు. కాగా ఈ సినిమాను 2025 సెకండ్ హాఫ్‌లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: