ఉస్తాద్ రామ్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సైలెంట్ గా ఓటిటి లోకి వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.తెలుగు తోపాటు కన్నడ,మళయాలం,తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.ఇక థియేట్రికల్ రన్ విషయానికి వస్తే గత నెల 15న విడుదలైన ఈసినిమా అంచనాలను అందుకోలేకపోయింది.మొదటి రోజు 12కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టగా నెగిటివ్ టాక్ వల్ల ఆ తరువాత నిరాశపరిచింది.హనుమాన్ నిర్మాతలు ఈసినిమా థియేట్రికల్ హక్కులను తీసుకోగా వారికి భారీ నష్టాలను మిగిల్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బాస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా లో రామ్ నటన,డ్యాన్స్ మెప్పించాయి.ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా చేశాడు.మణిశర్మ సంగీతం అందించాడు.పూరి తో కలిసి ఛార్మి ఈసినిమాను నిర్మించింది.
ఇక ఈసినిమా తరువాత అటు రామ్ కానీ పూరి కానీ తమ నెక్స్ట్ సినిమాలను ఇంకా ప్రకటించలేదు.అయితే రామ్ ,మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ మహేష్ బాబు తో ఓ సినిమాకు కమిట్ అయ్యాడని వార్తలు వచ్చాయి కానీ ఇంతవరకు ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు.మరోవైపు రామ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.రామ్ మాత్రం ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.దాంతో నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ ఆలస్యం కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: