ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2: ది రూల్’. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు 6న పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. బన్వర్ సింగ్ షెకావత్‌గా పుష్ప ది రైజ్‌లో ఆకట్టుకున్న ఫహాద్ ఈ చిత్రంలో అంతకు మించి క్రేజీగా ఆడియన్స్‌ను ఆకట్టుకోబోతున్నాడు. కాగా గురువారం ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్‌లో గళ్ల లుంగీ ధరించి, ఒక చేతిలో గన్‌తో.. మరో చేతిలో గొడ్డలితో కనిపిస్తున్నాడు. వైలెంట్ గా కనిపిస్తున్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రతి ప్రమోషన్ కంటెంట్ అందరిలోనూ అంచనాలు పెంచేస్తున్నాయి. టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది.రోజురోజు కు అంచనాలు పెంచుకుంటున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతుంది. ప్రస్తుతం క్లైమాక్స్ సీన్స్ అత్యంత అద్బుతంగా చిత్రీకరించే పనిలో వున్నారు. ఈ షెడ్యూల్ లో హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. కాగా సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా వుండబోతున్నాయని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. రేపు థియేటర్‌లో ఈ పతాక సన్నివేశాలు ప్రేక్షకులకు గూజ్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: