పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఆయన ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా మరోవైపు కొంతమంది మాత్రం పవర్ స్టార్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆ టైమ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ పవన్ సినిమాకోసం చాలామంది చూస్తున్నారు. ప్రస్తుతం అయితే తన లిస్ట్ లో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మూడు సినిమాలు కూడా సెట్స్ పైనే ఉన్నాయి. పవన్ కాస్త టైమ్ తీసుకని డేట్స్ ఇవ్వడమే తరువాయి మేకర్స్ పవన్ పోర్షన్స్ ను పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా హరిహర వీరమల్లు సినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో లెెజెండరీ యాక్టర్ నటిస్తున్నట్టు తెలిపారు. ఆ నటుడు ఎవరో కాదు అనుపమ్ ఖేర్. ఈసినిమాలో అనుపమ్ ఖేర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు చిత్రబృందం తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. కార్తికేయ 2 సినిమాలో తన నటనతో అలరించిన అనుమర్ ఖేర్ కు ఆసినిమా తరువాత నుండి తెలుగులో పలు అవకాశాలు దక్కుతున్నాయి.
కాగా క్రిష్ దర్శకత్వంలో మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈసినిమా వస్తుంది. మరోవైపు ఈసినిమా మిగిలిన షూటింగ్ ను క్రిష్ పర్యవేక్షణలో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ పూర్తి చేయనున్నాడు. క్రిష్ వేరే ప్రాజెక్ట్ తో బిజీ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్, బాబి డియోల్, నోరా ఫతేహి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: