ట్రైలర్ చూస్తే ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపించింది

Adivi Sesh Says, Feel Positive Vibe After Watching Committee Kurrollu Trailer

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుద‌ల చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇది వరకు రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సోమవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, అడివి శేష్, వెంకీ అట్లూరి వంటి వారు గెస్ట్‌గా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశం ఇచ్చారు.

అనంతరం హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం కోసం అందరూ కమిటెడ్‌గా పని చేశారని అర్థం అవుతోంది. నాకు ట్రైలర్ చాలా నచ్చింది. ఈ చిత్రంలో అన్ని అంశాలను చూపించారు. ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపించింది. టీం మీద రెస్పెక్ట్‌తో ఇక్కడకు వచ్చాను. చాలా పాజిటివ్ వైబ్‌ కనిపిస్తోంది. కేరాఫ్ కంచరపాలెం సినిమాకు ఇలాంటి ఫీలింగ్ వచ్చింది” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ మూవీ కూడా కలెక్షన్లతో పాటుగా, అవార్డులను కూడా కొల్లగొడుతుంది. వంశీ గారితో నాకు ఓ సినిమా చేయాలని ఉంది. అనుదీప్ గారి పాటలు చాలా నచ్చాయి. నిహారిక, ఫణి గారికి మంచి సక్సెస్ రావాలి. ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని అందరూ చూడండి” అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.