
షూటింగ్ అప్‌డేట్
ట్యాగ్ · 1 కథనాలు


సూపర్ స్టార్ రజినీకాంత్ వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవా రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా కూలీ. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు కానీ ఇంతవరకూ సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. అయితే జులై నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చారు చిత్రయూనిట్. సూపర్ స్టార్ - లోకి సంభవం బిగిన్స్.. కూలీ షూటింగ్ ఈరోజు నుండి మొదలైంది అంటూ చిత్రనిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.