టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు దూత అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. దూత వెబ్ సిరీస్ తో మంచి హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేమమ్ అలానే సవ్యసాచి సినిమాలు రాగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రాబోతున్నారు. ఈసినిమాను సముద్రం బ్యాక్ డ్రాప్లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తుండటంతో భారీ అంచనాలే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే మొదలుపెట్టారు మేకర్స్. ఇక మొదలుపెట్టిన కొద్దిరోజుల నుండే అప్ డేట్లు ఇవ్వడం మొదలుపెట్టారు చిత్రబృందం. ఇప్పటికే నాగ చైతన్య, సాయి పల్లవి ఫస్ట్ లుక్ లు రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గ్లింప్స్ అయితే చాలా బాగుంది. ముందు నాగచైతన్య ను చూపించిన టీమ్ ఆ తరువాత పాకిస్తాన్ కరాచీలోని సెంట్రల్ జైల్ లో ఉండటం చూపించారు. అంతేకాదు మా నుండి ఊడిపోయిన ఒక ముక్క మీకే అంత ఉంటే.. ఆ ముక్కని ముష్టి వేసిన మాకెంత ఉండాలి.. మీ పాకిస్తాన్ నేలపై ఉండి చెబుతున్నా భారత్ మాతాకి జై అంటూ నాగచైతన్య చెప్పిన డైలాగ్ హైలెట్ గా ఉంది. చివరిలో సాయి పల్లవి ఎంట్రీ అదిరిపోయింది.ముందు నాగచైతన్య ను చూపించిన టీమ్ ఆ తరువాత పాకిస్తాన్ కరాచీలోని సెంట్రల్ జైల్ లో ఉండటం చూపించారు. అంతేకాదు మా నుండి ఊడిపోయిన ఒక ముక్క మీకే అంత ఉంటే.. ఆ ముక్కని ముష్టి వేసిన మాకెంత ఉండాలి.. మీ పాకిస్తాన్ నేలపై ఉండి చెబుతున్నా భారత్ మాతాకి జై అంటూ నాగచైతన్య చెప్పిన డైలాగ్ హైలెట్ గా ఉంది. చివరిలో సాయి పల్లవి ఎంట్రీ అదిరిపోయింది.
ఈపాలి యేట..గురి తప్పేదెలేదేస్…ఇక రాజులమ్మ జాతరే 💥💥#EssenceofThandel out now ⚓
– https://t.co/ziOu01tjV1#Thandel shoot in progress ⛵#Dhullakotteyala 🔥Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP @GeethaArts #AlluAravind #BunnyVas… pic.twitter.com/BvCOFYp5H1
— Geetha Arts (@GeethaArts) January 6, 2024
కాగా ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: