ఆశిష్ కు జోడీగా బేబి ఫేమ్ వైష్ణవి

Vaishnavi Chaitanya Joins In Ashish 3 Movie

దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఆ తరువాత సెల్ఫిష్ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మూడో సినిమాతో వచ్చేస్తున్నాడు. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ఈసినిమా రాబోతుంది. ఈసినిమాను ఈమధ్యే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో నటించే హీరోయిన్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా బేబి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన వైష్ణవి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈసినిమాలో తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈసినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =