టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ‘సలార్’. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో తొలిభాగం ‘సలార్: పార్ట్ 1-సీజ్ ఫైర్’ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. ఇక సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేయగా.. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రిలీజైన మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనికితోడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్‌ను ఫుల్ యాక్షన్ మోడ్‌లో చూపడంతో సలార్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రభాస్ నట విశ్వరూపం చూపించడంతో ఫ్యాన్స్ వెర్రెక్కిపోతున్నారు. దీంతో సలార్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూ భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో సలార్ నైజాం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ఈ క్రమంలో కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇక ఇప్పటికే షారుఖ్ ఖాన్ హీరోగా ఈ ఏడాది వచ్చిన జవాన్ సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.384 కోట్ల కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే.
Dinosaur’s humongous roar at the box office 🦖#BlockbusterSalaar collects 50cr+ share in Nizam in 4 Days ❤️🔥❤️🔥#RecordBreakingSalaar 💥
Nizam Release by @MythriOfficial 💥#Salaar #SalaarCeaseFire#Prabhas #PrashanthNeel @PrithviOfficial… pic.twitter.com/Gl0pvXcetK
— Telugu FilmNagar (@telugufilmnagar) December 26, 2023
అయితే తాజాగా దీనిని తొలి మూడో రోజుల్లోనే రూ.400 కోట్ల వసూళ్లతో సలార్ దాటేసింది. తద్వారా ఈ ఏడాది తొలి వీకెండ్లో అత్యధిక కలెక్షన్లను దక్కించుకున్న మూవీగా సలార్ నిలిచింది. మరోవైపు ఆంధ్ర, సీడెడ్లోనూ సలార్ దుమ్ము రేపుతోంది. కాగా సలార్‌లో శృతి హాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘వరదరాజ మన్నార్’ అనే కీలక పాత్ర పోషించారు. అలాగే టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: