నాగచైతన్య తండేల్ షూటింగ్ అప్‌డేట్

Naga Chaitanya's Thandel Movie Shooting Update

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. ఇందులో ఆయన తొలిసారి వైవిధ్యంగా ఒక మత్స్యకారుడిగా కనిపిస్తున్నారు. దీంతో మత్స్యకారుడి పాత్రకు తగట్టుగా చైతన్య మేకోవర్ అవ్వడం విశేషం. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తండేల్ సినిమాకి సంబంధించి ఒక కీలక అప్‌డేట్ ఇచ్చింది చిత్ర బృందం. తండేల్ షూటింగ్ ప్రారంభమైనట్లు మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు తండేల్ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని గీతా ఆర్ట్స్ వెల్లడించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఫై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా సముద్రం ఒడ్డున ఓడల మధ్య నాగ‌చైత‌న్య నడుచుకుంటూ వెళుతున్నట్టుగా ఉన్న ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీనికి “సముద్రం మధ్య ఉత్కంఠభరితమైన షెడ్యూల్‍ను తండేల్ టీమ్ మొదలుపెట్టింది. షూటింగ్ జరుగుతోంది” అని గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. అలాగే త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరికొన్ని ఎగ్జైటింగ్ అప్‍డేట్స్ ఇస్తామని కూడా పేర్కొంది. కాగా ప్రస్తుతం ఉడిపిలోని మాల్పే పోర్టు సమీపంలో ఈ సినిమా షూటింగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఇందుకు సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఫై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 16 =