ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్. ఈసినిమా ఆగష్ట్ 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్కప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఈనేపథ్యంలో ఇప్పటికే టీజర్ ను కూడా రిలీజ్ చేయగా.. చిరు ఎనర్జిటిక్ యాక్టింగ్ అండ్ స్వాగ్ తో సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇన్ని రోజులు ఈసినిమా గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మెహర్ రమేష్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. భోళా శంకర్ షూటింగ్ పూర్తయిందని.. ఈసినిమా కోసం రాత్రి పగలు నాన్ స్టాప్ గా పనిచేసిన వారందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
@BholaaShankar 🔱 Shoot has completed 😇
Whole hearted thanks to the cast & crew who are working non-stop day & night 🙏
Post-production works going on with full swing. Promotions & song releases ahead. #August11thworldwide release #BholaaShankar @KChiruTweets 🙏🌟… pic.twitter.com/9ldUDfgsMv
— Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) July 3, 2023
కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: