రిలీజ్ అయిన శాకుంతలం మూవీ 3D ట్రైలర్

Shaakuntalam Movie 3D Trailer Released

గుణ టీమ్ వర్క్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో 3 D ఫార్మాట్ లో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా శాకుంతలం ఏప్రిల్ 14 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ళ, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ ఈ మూవీ లో పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శాకుంతలం మూవీ ప్రమోషన్స్ ను సమంత ప్రారంభించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శాకుంతలం మూవీ 3D ట్రైలర్ ను మంగళవారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్బంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ..నిజానికి ఈ సినిమా నిర్మాణంలో తాను జాయిన్ కావటానికి కారణం, గుణశేఖర్ గారికి హెల్ప్ చేయడం కోసమే అని అంతా అనుకుంటున్నారనీ , కానీ వీఎఫ్ ఎఫెక్స్ కి సంబంధించిన ఒక పాన్ ఇండియా సినిమాకి ఎలా పనిచేయాలనేది నేర్చుకోవడం కోసం ఈ ప్రాజెక్టులో జాయిన్ అయ్యాననీ , తరువాత జనరేషన్స్ వారికి ఇలాంటి కథలను పరిచయం చేయవలసిన అవసరం ఉందనీ , ఈ వేసవి కోసం ఒక మంచి సినిమాను రెడీ చేశాము .. చూసి ఎంజాయ్ చేయండనీ చెప్పారు మరో నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ .. శాకుంత‌లం సినిమాను 3D టెక్నాల‌జీలోకి మార్చాల‌నే ఆలోచన దిల్‌రాజుగారిదే ననీ , అందుకు ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌ అనీ , ఇప్పుడు త్రీడీ ట్రైల‌ర్ చూస్తుంటే ఆయ‌న ఆలోచ‌న ఎంత గొప్ప‌దో అర్థ‌మ‌వుతుందనీ , మ‌న మైథాల‌జీని ఇలా త్రీడీలో సినిమా చేయ‌టం ఇదే తొలిసారి అనుకుంటా.ననీ , మ‌న సంస్కృతిని సెల‌బ్రేట్ చేసుకుంటున్నామనీ , 3Dలో శాకుంతలం సినిమాను ఎంజాయ్ చేస్తార‌ని ఆశిస్తున్నాననీ చెప్పారు.
దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ .. ఇది సమంతగారి శాకుంతలం అనీ , మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకూ ఆమె అద్భుతంగా చేశారనీ , శకుంతల పాత్రకి ప్రాణ ప్రతిష్ఠ చేశారనీ చెప్పారు.
రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ .. ఈ కథను గుణశేఖర్ గారు టేకాఫ్ చేసే విధానమే అద్భుతంగా అనిపించిందనీ , ఈ సినిమా నవ్విస్తుంది … ఏడిపిస్తుంది. ప్రపంచంలో ప్రేమతప్ప మరేదీ లేదనిపిస్తుందనీ , సమంతగారు తన పాత్రకి వందకి వంద శాతం న్యాయం చేశారనీ , ఈ సినిమాకి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + fifteen =