లియో షూటింగ్ షెడ్యూల్స్ అప్ డేట్

vijays leo movie new schedules update

స్టార్ హీరో విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. దీంతో ఈసినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈసినిమా షూటింగ్ ను జనవరి నుండి మొదలుపెట్టారు మేకర్స్. ఇక షూటింగ్ ను మొదలుపెట్టినప్పటినుండి గ్యాప్ లేకుండా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది కూడా. అంతేకాదు ఈసినిమాలో నటిస్తున్న స్టార్ డైరెక్టర్ మిస్కిన్ ఇప్పటికే తన పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు ఈసినిమా షూటింగ్ షెడ్యూల్స్ గురించి మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. ఈసినిమా కొత్త షెడ్యూల్ ను మార్చి 29న చెన్నై లో స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఆ తరువాత హైద్రాబాద్ లో కూడా కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉందట. ఫైనల్ గా షూటింగ్ మొత్తం ఏప్రిల్ ఎండింగ్ లేదా మే లో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారట. మరి చూద్దాం ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో.

ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కత్తి, మాస్టర్, బీస్ట్‌ చిత్రాలతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌ మరోసారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తుండగా.. సతీశ్ కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ గా.. అన్బరివ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 1 =