టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా వచ్చిన సినిమా ధమ్కీ. కామెడీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈసినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డ్యూయల్ రోల్ లో విశ్వక్ సేన్ చూపించిన వేరియన్స్ అలానే కామెడీ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ ను అందుకుంటుంది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 18.1 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ చేసి ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లింది. ఇక ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ లో కూడా ఎక్కడా తగ్గట్లేదు. అక్కడ కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటివరకూ యూఎస్‌లో 30వేల డాలర్లు వసూళ్లు చేసింది. రానున్న రోజుల్లో మరింత వసూళ్లు రాబట్టడం ఖాయమని చెబుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటించగా ఇంకా ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటించారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: