వినరో భాగ్యము విష్ణుకథ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

vinaro bhagyamu vishnu katha movie ott release date fixed

ఎలాంటి బ్యాక్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడం అంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది వరుస అవకాశాలు దక్కించుకోవడం.. అందులోనూ పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమా అవకాశాలు దక్కించుకోవడం అంటే మాములు విషయం కాదు. కానీ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం వాటన్నింటిని అధిగమించి ప్రస్తుతం కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రాజావారు రాణివారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కిరణ్ అబ్బవరం మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీసెంట్ గానే వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మురళీ కిశోర్ దర్శకత్వంలో కామెడీ ప్లస్ థ్రిలింగ్ కథాంశంతో వచ్చిన ఈసినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అంతేకాదు నిర్మాతలకు లాభాలను సైతం అందించింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేస్తుంది. ‘ఉగాది’ పండుగ సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి థ్రిల్ అవ్వండి.

కాగా ప్రస్తుతం మరో సినిమాను వెంటనే రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. రమేశ్ కాడూరి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్న ఈసినిమాలో కిరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఈసినిమా ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ కానుంది. రీసెంట్ గానే తన 9వ సినిమాను కూడా ప్రారంభించేశాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.