హిస్టారిక్ ఫోర్ట్ దగ్గర ఇండియన్ 2 షూట్

Indian 2 movie shooting at historic fort

విలక్షణ నటుడు కమల్ హాసన్ చాలా గ్యాప్ తరువాత విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఇండియన్2 సినిమాతో వస్తున్నాడు. భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా.ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక మరోవైపు శంకర్ కూడా ఒకవైపు రామ్ చరణ్ సినిమాను పూర్తి చేస్తూనే మరోపక్క ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో బీజీగా ఉన్నాడు శంకర్. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ తమిళ్ నాడులోని కాల్పక్కం డచ్ పోర్ట్ లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ శంకర్ ఓ హై ఆక్టన్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్థ్, గుల్షన్ గ్రోవర్, నెదురుమూడి వేణు, సముద్రఖని, బాబీ సింహ, గురు సోమసుందరం, ఢిల్లీ గణేష్, జయ ప్రకాష్, మారి ముత్తు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు. ఈసినిమాను దీపావళి పండుగ సందర్బంగా నవంబర్ 9 లేదా 10 వ తేదీకి రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − ten =