
ట్యాగ్ · 4 కథనాలు

పవన్ కళ్యాణ్ కి జోడీగా పూజా హెగ్డే?

రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్?

'పింక్' తర్వాత 'పవన్' ముల్టీస్టారర్..?

పవన్ - సుజీత్ మూవీ క్రేజీ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రీఎంట్రీ తరువాత ఒక సినిమా తరువాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అయితే తను చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమా తో పాటు పవన్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ కోసం కూడా అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ కి జోడీగా పూజా హెగ్డే?
హిందీనాట ఘనవిజయం సాధించిన `పింక్`... తమిళంలో `నేర్ కొండ పార్ వై` పేరుతో రీమేక్ అయి అక్కడా బ్లాక్ బస్టర్ బాట పట్టింది. అంతేకాదు.. ఇప్పుడా ఎమోషనల్ కోర్ట్ డ్రామా తెలుగులోనూ రీమేక్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ ఫిల్మ్ గా తెరకెక్కనున్న ఈ రీమేక్ కి `లాయర్ సాబ్` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. `దిల్` రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ బాట పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. `పింక్` రీమేక్ ని తన పునరాగమనానికి వేదికగా చేసుకున్న పవన్.. ఆపై టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నాటి కాలంలో సాగే ఈ పిరియాడికల్ ఫిల్మ్ లో పవన్.. రాబిన్ హుడ్ తరహా పాత్రలో దర్శనమిస్తారని తెలిసింది. అంటే.. అవినీతిపరులైన పెద్దల సొమ్మును కొట్టి పేదలకు సాయం చేసే దొంగగా పవర్ స్టార్ కనిపిస్తాడన్నమాట.

'పింక్' తర్వాత 'పవన్' ముల్టీస్టారర్..?
అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాలీవుడ్ హిట్ చిత్రం 'పింక్' ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇదే సినిమాను తమిళంలో 'నెర్కొండ పార్వాయి' అనే టైటిల్‌తో.. అజిత్ ప్రధాన పాత్రలో తమిళ్ లో రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ కొట్టింది. ఇప్పుడు తెలుగులోను పింక్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. హిందీలో అమితాబ్ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్, దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ…