రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈనేపథ్యంలోనే చిరంజీవి రీసెంట్ గా గాడ్ ఫాదర్ తో దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా మంచి హిట్ టాక్ ని అందుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాను. ఇప్పటికే చాలా మంది తమ సోషల్ మీడియా వేదికగా సైతం సినిమాను ప్రశంసించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈలిస్ట్ లో అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. సాధారణంగా ఏదైనా సినిమా తనకు నచ్చితే అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పొగడ్తలు కురిపించే అలవాటు ఉంటుంది. అంతేకాదు చిన్న సినిమాలు అయితే ఒక్కోసారి చిత్రయూనిట్ లను పిలిపించి మరీ అభినందిస్తుంటారు. ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ ను కూడా అల్లు అర్జున్ ప్రశంసించినట్టు చెప్పారు మోహన్ రాజా. ఈసినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఈసందర్భంగా మోహన్ రాజా మాట్లాడుతూ.. సినిమా చూసిన అల్లు అర్జున్ తనకు ఫోన్ చేసి ‘సినిమా చాలా బావుంది.. లడ్డూలా వుంది..’ అంటూ అల్లు అర్జున్ తనతో చెప్పినట్లు మోహన్ రాజా చెప్పుకొచ్చాడు..
కాగా ‘లూసిఫర్’లో పృధ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రని సల్మాన్ ఖాన్.. మంజు వారియర్ పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్.. ఇంకా పూరీ జగన్నాథ్ అలానే సునీల్ కూడా కీలకపాత్రల్లో నటించారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: