
ట్యాగ్ · 2 కథనాలు


శాకుంతలం రిలీజ్ డేట్ వాయిదా

మరోసారి శాకుంతలం రిలీజ్ డేట్ వాయిదా
ఈ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సమంత శాకుంతలం కూడా ఒకటని చెప్పొచ్చు. గుణశేఖర్-సమంత కాంబినేషన్ లో సినిమా వస్తుండటం.. అందులోనూ మైథలాజికల్ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ కథతో ఈసినిమా వస్తుండటంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇంకా పాటలు అన్నీ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. అయితే ఈసినిమా రిలీజ్ పై మరోసారి ఫ్యాన్స్ కు షాకిచ్చారు మేకర్స్. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ వాయిదా పడనున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ వార్తలు నిజం చేస్తూ నిజంగానే సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు…

శాకుంతలం రిలీజ్ డేట్ వాయిదా
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.మహాభారతంలోని ఆదిపర్వంలో దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాకు విజువల్స్ ఎంత ముఖ్యమో తెలిసిందే కదా. ప్రస్తుతం చిత్రయూనిట్ అదే పనిలో ఉంది. ప్రేక్షకులకు విజులవల్ ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక ఈసినిమాను నవంబర్ 4వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. ఈవిషయాన్ని తెలియచేస్తూ చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు.