మెగా కాంపౌండ్ లో ఇప్పటికే చాలా మంది హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అలాంటి టైమ్ లో మెగా కాంపౌండ్ ను వచ్చి ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో తన మార్క్ ను చూపించాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే హిట్ కొట్టి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమాతోనే మెగా కాంపౌండ్ పలు రికార్డులు కూడా చెరిపేశాడు. ఆ వెంటనే కొండ పొలం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చినా కూడా టాక్ పరంగా మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా రంగరంగ వైభవంగా సినిమా. అయితే ముందు రెండు సినిమాలు కూడా కాస్త సెటిల్డ్ గా నిదానంగా ఉండే పాత్రలే. అయితే ఈసారి లవర్ బాయ్ పాత్ర ద్వారా వస్తున్నాడు. ఈసినిమా జులై1వ తేదీన రిలీజ్ అవుతుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. అలాగే పాటలు కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ను బట్టి ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అని అర్థమవుతుంది. హీరో హీరోయిన్ ట్రాక్, కామెడీ అన్నీ సినిమాకు కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Refresh your evening with the Lovely Tale of Rishi & Radha ❤️#RangaRangaVaibhavanga Theatrical Trailer Out Now.
▶️ https://t.co/vLIbQJhr3w#PanjaVaisshnavTej @TheKetikaSharma @GIREESAAYA @ThisIsDSP @SVCCofficial #BVSNPrasad @SonyMusicSouth #RRVOnSep2nd pic.twitter.com/gJNA1Rs5xB
— SVCC (@SVCCofficial) August 23, 2022
కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉప్పెన సినిమాకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: