సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్ “కళావతి” తరువాత సెకండ్ సింగిల్ పెన్నీ, థర్డ్ సింగిల్ టైటిల్ సాంగ్స్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. “సర్కారు వారి పాట” ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని 24 గంటలలో 27 మిలియన్ వ్యూస్, 1.2 మిలియన్ లైక్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మ మ మహేషా మాస్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. థమన్ ఎస్ స్వరకల్పనలో అనంత శ్రీరామ్ రచన , శ్రీకృష్ణ , జోనిటా గాంధీ గానం చేసిన మ మ మహేషా మాస్ సాంగ్ ప్రేక్షక అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లో మహేష్ బాబు , కీర్తి సురేష్ తమ అద్భుతమైన మాస్ స్టెప్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మ మ మహేషా సాంగ్ రెండు రోజులలో 20 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి 21 మిలియన్ వ్యూస్ దిశగా దూసుకుపోతోంది. “సర్కారు వారి పాట” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: