టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు కూడా ఒకడు. కాస్త రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను తీయడానికే శ్రీవిష్ణు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. సినిమా జయాపయాలతో పనిలేకుండా ప్రస్తుతం అయితే కెరీర్ లో ఎలాంటి ఢోకా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది ‘గాలి సంపత్’, రాజ రాజ చోర అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈఏడాది అర్జున ఫల్గుణ అనే సినిమాతో అలరించాడు. అయితే ఈ సినిమా కూడా అనుకున్నంత విజయం అందించలేకపోయింది. ఇక ప్రస్తుతం 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో ''భళా తందనాన'' అనే సినిమాను చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.
ఇక తాజాగా మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు ఒక సినిమా చేస్తున్నాడు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమాకు సంబంధించిన టైటిల్ ను అలానే ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాకు అల్లూరి అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా శ్రీ విష్ణు కనిపించనున్నట్టు తెలుస్తుంది.
కాగా యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాను లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించనున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా.. శివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.