
ట్యాగ్ · 7 కథనాలు


ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో శ్రీవిష్ణు

అల్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీవిష్ణు స్పీచ్

శ్రీ విష్ణు "అల్లూరి " మూవీ రిలీజ్ డేట్

శ్రీవిష్ణు 'అల్లూరి' టీజర్ రిలీజ్..!

'అల్లూరి' గా వస్తున్న శ్రీవిష్ణు..!

శ్రీ విష్ణు కొత్త సినిమా ప్రారంభం
టాలెండెట్ హీరో శ్రీ విష్ణు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళిపోతున్నాడు. ఇక రీసెంట్ గానే అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీవిష్ణు.. ఇప్పుడు మరో సినిమాను ప్రారంభించేశాడు. శ్రీవిష్ణు హీరోగా వివాహ భోజనంబు సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజుతో చేతులు కలిపారు. శ్రీవిష్ణుతో చేయబోతున్న కొత్త చిత్రంతో రామ్ అబ్బరాజు థియేటర్ సినిమాకి పరిచయం కానున్నారు.

ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో శ్రీవిష్ణు
సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక ప్రస్తుతం శ్రీవిష్ణు నుండి వస్తున్న సినిమా అల్లూరి. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈసినిమాలో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక ఈసినిమా ఈనెల 23వ తేదీన రిలీజ్ కానున్న ప్రస్తుతం శ్రీవిష్ణు తన కొత్త సినిమా అల్లూరి ప్రమోషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈసందర్భంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు శ్రీవిష్ణు. ఈనేపథ్యంలో తన…

అల్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీవిష్ణు స్పీచ్
లక్కీ మీడియా బ్యానర్ పై ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు , కయడు లోహర్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అల్లూరి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో సుమన్ , తనికెళ్ళ భరణి , రాజా రవీంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అల్లూరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ స్పీచ్
లక్కీ మీడియా బ్యానర్ పై ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు , కయడు లోహర్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అల్లూరి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో సుమన్ , తనికెళ్ళ భరణి , రాజా రవీంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

శ్రీ విష్ణు "అల్లూరి " మూవీ రిలీజ్ డేట్
విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీ విష్ణు ఒక పవర్ ఫుల్ మాస్ కంటెంట్ తో తెరకెక్కిన మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. బెక్కెం బబిత సమర్పణ లో లక్కీ మీడియా బ్యానర్ పై ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు కథానాయకుడిగా నిజాయితీకి మారు పేరుట్యాగ్ లైన్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ "అల్లూరి " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో కయ్యదు లోహర్ కథానాయిక. సుమన్, తనికెళ్ల భరణి, మధుసూధన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర నటిస్తున్నారు.హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.

శ్రీవిష్ణు 'అల్లూరి' టీజర్ రిలీజ్..!
ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో శ్రీవిష్ణు ఎప్పుడూ ముందుంటాడు. రీసెంట్ గా భళా తందనాన సినిమాతో మెప్పించిన శ్రీవిష్ణు ఇప్పుడు మరో సినిమాను రెడీ చేస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా అల్లూరి. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా. తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

'అల్లూరి' గా వస్తున్న శ్రీవిష్ణు..!
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు కూడా ఒకడు. కాస్త రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను తీయడానికే శ్రీవిష్ణు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. సినిమా జయాపయాలతో పనిలేకుండా ప్రస్తుతం అయితే కెరీర్ లో ఎలాంటి ఢోకా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది ‘గాలి సంపత్’, రాజ రాజ చోర అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈఏడాది అర్జున ఫల్గుణ అనే సినిమాతో అలరించాడు. అయితే ఈ సినిమా కూడా అనుకున్నంత విజయం అందించలేకపోయింది. ఇక ప్రస్తుతం 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో ''భళా తందనాన'' అనే సినిమాను చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.